దేశంలోనే అత్యంత పొడవైన వంతెన(Bridge) ‘సుదర్శన్ సేతు’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ లో రెండు రోజుల పాటు పర్యటిస్తున్న ప్రధాని.. ఈ బ్రిడ్జికి ప్రారంభోత్సవం చేశారు. ద్వారకలోని కృష్ణుడి మందిరంలో పూజలు చేసిన ప్రధాని.. అరేబియా సముద్రంలో 2.32 కిలోమీటర్ల మేర నిర్మించిన వంతెనను ప్రారంభించారు. దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనగా ‘సుదర్శన్ సేతు’ నిలిచిపోతుంది.
భారీ వ్యయంతో ప్రాజెక్టు…
ఓఖా ప్రధాన భూభాగం నుంచి బేట్ ద్వారక ద్వీపం(Island)ను కలుపుతూ ఈ ‘సుదర్శన్ సేతు’బ్రిడ్జిని నిర్మించారు. రూ.979 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో నాలుగు లేన్ల(Four Lines)తో కూడిన బ్రిడ్జిని రూపొందించారు. ఈ ప్రాజెక్టుతోపాటు ద్వారకలో మరో రూ.4,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.