ఈ ఏడాది ఉష్ణోగ్రతలు(Temparatures) దేశవ్యాప్తంగా బెంబేలెత్తించాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు వేడిగాలుల(Heatwates)తో ఉక్కిరిబిక్కిరయ్యాయి. ఇటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోయి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయితే ఈ సంవత్సరం అత్యంత సుదీర్ఘ(Longest) వేడిగాలులు నమోదైనట్లు భారత వాతావరణ(Meteorological) శాఖ తెలిపింది.
ఈ రాష్ట్రాల్లో…
దేశంలోనే అత్యధికంగా ఒడిశా(Odisha)లో భానుడు భగభగలాడించాడు. అక్కడ 27 రోజుల పాటు వేడిగాలులు వీచి దేశంలోనే లాంగెస్ట్ హీట్‌వేవ్స్ రికార్డయిన రాష్ట్రంగా నిలిచింది. ఇక 23 రోజులతో ఎడారి రాష్ట్రం రాజస్థాన్ రెండో స్థానంలో.. 21 రోజులతో పశ్చిమబెంగాల్ మూడో స్థానంలో ఉన్నట్లు IMD తన రిపోర్టులో తెలియజేసింది.
ఆ తర్వాత 20 రోజుల సుదీర్ఘ వేడిగాలులతో ఢిల్లీ, హర్యానా, ఛండీగఢ్, ఉత్తరప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచాయి. మార్చి 1 నుంచి జూన్ 9 వరకు గల కాలాన్ని అంచనా వేసి ఈ రిపోర్టును తయారు చేసింది IMD. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సంవత్సరం 50 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు రికార్డయినట్లు వార్తలు వచ్చినా ఆ విషయంలో క్లారిటీ రాలేదు.