భారత వ్యతిరేక భావజాలానికి, పాకిస్థాన్ అనుకూలురైన దేశద్రోహులకు చెంప పెట్టులాంటి శిక్ష విధించింది మధ్యప్రదేశ్ హైకోర్టు. జాతీయ జెండా(National Flag)కి సెల్యూట్ చేస్తూ 21 సార్లు భారత్ మాతా కీ జై అనాల్సిందే అంటూ ఆదేశాలిచ్చింది. ఫైజల్ అలియాస్ ఫైజాన్ అనే నిందితుడు పాకిస్థాన్ జిందాబాద్, హిందూస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేసి దేశద్రోహానికి పాల్పడ్డాడు. దీనిపై కింది కోర్టు అతడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
13 క్రిమినల్ కేసులున్న అతడికి బెయిల్ మంజూరవడంపై స్టేట్ కౌన్సిల్ అభ్యంతరం తెలిపింది. దీనిపై హైకోర్టులో వాదనలు జరగ్గా.. నిందితుడికి రూ.50 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరైంది. కానీ ప్రతి నెల మొదటి, నాలుగో మంగళవారాల్లో భోపాల్ లోని మిస్రోడ్ పోలీస్ స్టేషన్ పైన గల జాతీయ జెండాకు సెల్యూట్ చేయాలని షరతు(Condition) విధించింది. తుది తీర్పు వెలువడేవరకు హాజరైన ప్రతిసారీ 21 సార్లు భారత్ మాతా కీ జై అనాల్సిందేనని ఆదేశాలిచ్చింది.