సర్పంచి హత్యకేసులో తీవ్రమైన ఆరోపణలు రావడంతో మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండే రాజీనామా చేశారు. గత డిసెంబరులో బీడ్(Beed) జిల్లా మాసజోగ్ గ్రామ సర్పంచి సంతోశ్ దేశ్ ముఖ్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ధనుంజయ్ అనుచరుడైన వాల్మిక్ కరాడ్ అనే వ్యక్తి అరెస్టయ్యాడు. ఈ ఆరోపణలతో ప్రభుత్వం ఇరకాటంలో పడగా, CM CM దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు పదవి నుంచి మంత్రి తప్పుకున్నారు. ఆ రాజీనామా(Resignation)ను గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ కు పంపగా, వెంటనే ఆమోదించారు. మంత్రి అనుచరుడిపై ఛార్జిషీట్ నమోదు కావడంతో.. కేసు తీవ్రత దృష్యా డిప్యూటీ CM అజిత్ పవార్ తో ఫడ్నవీస్ భేటీ అయి ఈ నిర్ణయం తీసుకున్నారు.