మాలేగావ్ పేలుళ్ల కేసు తీర్పులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. యూపీ CM యోగి ఆదిత్యనాథ్ సహా మరో నలుగుర్ని ఇరికించాలని బలవంతం చేసినట్లు నిందితుడు చెప్పాడని కోర్టు తెలిపింది. యోగి, RSS సభ్యులు ఇంద్రేశ్ కుమార్, దేవధర్, సాధ్వి ప్రజ్ఞాసింగ్, స్వామి అసిమానంద్ పేర్లు చెప్పాలంటూ మహారాష్ట్ర ATS పోలీసులు ఒత్తిడి తెచ్చారన్నారు. మిలింద్ జోషి రావ్ సాక్ష్యాన్ని జడ్జి ఎ.కె.లఖోటి తన వెయ్యి పేజీల తీర్పులో ప్రస్తావించారు. మాలేగావ్ లో బైక్ కు పెట్టిన బాంబు పేలి 2008 సెప్టెంబరు 29న ఆరుగురు మరణించారు. తగిన సాక్ష్యాలు లేవంటూ ప్రజ్ఞాసింగ్, ప్రసాద్ పురోహిత్, రమేశ్ ఉపాధ్యాయ, అజయ్ రాహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. తొలుత ఈ కేసును ATS చూడగా.. తర్వాత NIA దర్యాప్తు చేసింది.