
మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ సంచలన రీతిలో మాట్లాడారు. ‘పరిస్థితులు మారుతున్నాయి.. దేశం కూడా మారుతోంది.. ఎన్ కౌంటర్లలో మావోలు ప్రాణాలు కోల్పోతున్నారు.. అందరూ లొంగిపోవాలని కోరుతున్నా.. హిడ్మాతోపాటు చాలామంది చనిపోవడం బాధ కలిగించింది.. లొంగిపోవడానికి సిద్ధమైనవాళ్లు నాకు ఫోన్ చేయండి..’ అని తాను మాట్లాడిన వీడియో విడుదల చేశారు. 2025 నవంబరు 15న గడ్చిరోలిలో సభ ఏర్పాటు చేసిన మల్లోజుల.. మహారాష్ట్ర CM ఫడ్నవీస్ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన ఆయన పార్టీ అగ్రనేతగా పనిచేసిన కిషన్ జీకి సోదరుడు.