
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(CJI) బి.ఆర్.గవాయ్ పై దాడికి యత్నించాడో లాయర్. కోర్టులోనే ఆయనపై బూటు(Shoe) విసిరేందుకు యత్నించాడు. దీంతో నిందితుణ్ని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంది. వివిధ కేసుల విచారణ చేపడుతున్న సమయంలో CJI బెంచ్ కు అత్యంత సమీపానికి వచ్చి బూటు విసిరే ప్రయత్నం చేశాడు. సనాతన ధర్మాన్ని రక్షించాలంటూ నినాదాలు చేశాడు. అయితే ఇలాంటి ఘటనలకు వెనుకడుగు వేసేది లేదని గవాయ్ అన్నారు.