ఢిల్లీలో గద్దెనెక్కి హుషారు మీదున్న BJP.. ఇంకో రాష్ట్రమైన మణిపూర్ లో సమస్యలు ఎదుర్కొంటోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అనూహ్య నిర్ణయం తీసుకుని రాజీనామా చేశారు. బడ్జెట్ సమావేశాల్లోనే రాజీనామా చేసిన ఆయన.. గవర్నర్ అజయ్ భల్లాను కలిసి లేఖను అందించారు. కుకీ-మైతేయి తెగల పరస్పర దాడులతో ఈశాన్య రాష్ట్రం గత రెండేళ్లుగా అట్టుడుకుతోంది. ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో రాష్ట్ర పార్టీ నేతల నుంచి బీరేన్ సింగ్ కు వ్యతిరేకత(Dissidence) ఎదురైంది. ఇలా ముప్పేట దాడితో ఆయన ఇరుకున పడ్డారు.
మిత్రపక్షమైన కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ.. ప్రభుత్వం నుంచి వైదొలిగింది. వరుస పరిణామాల(Continue Issues)తో ఇరకాటంలో పడ్డ బీరేన్.. హైకమాండ్ తో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం ఈరోజే ఢిల్లీ నుంచి స్వరాష్ట్రానికి చేరుకున్నారు. బీరేన్ పట్ల కనీసం 12 మంది MLAలు వ్యతిరేకత కనబరుస్తున్నట్లు ప్రచారం జరిగింది.