
మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్(70) మృతిచెందారు. అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూసినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలానికి చెందిన రాజిరెడ్డి.. తొలుత RSUలో చేరారు. ఆ తర్వాత మంథని, మహదేవ్ పూర్ ఏరియా దళాల్లో భాగమై కేంద్ర కమిటీ మెంబర్ స్థాయికి ఎదిగారు. 1977లో జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపగా.. బెయిల్ పై రిలీజ్ అయి మళ్లీ ఉద్యమం బాట పట్టారు. రాజిరెడ్డిపై చాలా కేసులున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ పై దాడి చేసి SIతోపాటు మరో 12 మంది ఖాకీలను కాల్చి చంపిన కేసులో రాజిరెడ్డి నిందితుడు.
ఖమ్మం జిల్లా కరకగూడెం PSపై మెరుపుదాడితో 16 మందిని హతమార్చారు. మావోయిస్టు పార్టీ తొలి తరం నేతల్లో ఒకరిగా రాజిరెడ్డికి పేరుంది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లోనూ పలు టీమ్ లకు ఇంఛార్జిగా పనిచేశారు.