ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్(Encounter) జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు(Six Naxalites) మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. బీజాపూర్ జిల్లా బస్తర్ బాసాగూడ అటవీప్రాంతంలోని చీపురుబట్టి ఏరియాలో తాలిపేరు నది వద్ద భారీస్థాయిలో ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టు మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సుక్మా ప్రాంతానికి సమీపంలో ఈ ఘటన జరగడంతో అలజడి మొదలైంది. ఛత్తీస్ గఢ్-మహారాష్ట్ర పోలీసులు భారీయెత్తున గాలింపు జరుపుతున్నారు.
ఎన్నికల వేళ…
సార్వత్రిక ఎన్నికల(General Elections) దృష్ట్యా ఛత్తీస్ గఢ్ అటవీప్రాంతంలో పెద్దయెత్తున బలగాలు కూంబింగ్ జరుపుతున్నాయి. ఇలాంటి సమయంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య భారీస్థాయిలో కాల్పులు జరిగినట్లు బస్తర్ రేంజ్ IG పి.సుందర్ రాజ్ తెలిపారు. మృతుల్లో డిప్యూటీ కమాండర్ ఉన్నారని అనుమానిస్తున్నారు. బాసాగూడ క్యాంప్ 229వ బెటాలియన్, CRPF, కోబ్రా(CoBRA-Commando Battalion For Resolute Action) దళాలు జాయింట్ గా ఆపరేషన్ చేపట్టాయి. మొన్న
మరింతమంది…
ఆరుగురి మృతదేహాల్ని పోలీసులు స్వాధీనం చేసుకోగా.. ఈ ఘటనలో మరింతమంది మావోయిస్టులు చనిపోవడం లేదా తీవ్రంగా గాయపడి ఉంటారని ఉన్నతాధికారులు అంటున్నారు. హోలీ పండుగ వేళ ముగ్గురు గ్రామస్థుల్ని మావోయిస్టులు కాల్చి చంపిన దృష్ట్యా పోలీసులు ఈ కూంబింగ్ ఆపరేషన్ కు దిగారు. బస్తర్ ఏరియాలో తొలి విడతలోనే ఏప్రిల్ 19న ఎన్నికలు జరగబోతున్నాయి. మృతిచెందిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది.