ఛత్తీస్ గఢ్ లో జరిగిన రెండు వేర్వేరు(Separate) ఎన్ కౌంటర్లలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒక జవాను ఉన్నారు. బీజాపూర్(Bijapur) జిల్లా గంగలూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ కు చెందిన ఒక పోలీసు మృతిచెందారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం దాకా కాల్పులు జరిగాయి. 18 మంది మృతదేహాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. భారీగా ఆయుధాలను గుర్తించారు. కాంకేర్ జిల్లాలోని బస్తర్ డివిజన్లో జరిగిన మరో ఘటనలో ఇంకో నలుగురు మృత్యువాత పడ్డారు.