గత కొద్దికాలంలో ఎన్నడూ లేనంతగా భీకర ఎన్ కౌంటర్(Encounter) జరిగి 31 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఎదురుకాల్పుల్లో
ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. బీజాపూర్ జిల్లా దండకారణ్యం(Dense Forest)లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. తొలుత 12 మంది చనిపోయారని గుర్తించగా, ఆ తర్వాత మృతుల సంఖ్య 31కి చేరింది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్(DRG)తోపాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్(STF) బలగాలు గాలింపులో పాల్గొన్నాయి. ఇదే జిల్లాలో ఈ జనవరి 6న మావోయిస్టులు IED పేల్చడంతో 8 పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.