భారత కర్నల్(Colonel) సోఫియా ఖురేషిపై వివాదాస్పద కామెంట్స్ చేసిన BJP మంత్రి.. క్షమాపణ చెప్పేందుకు రెడీ అయ్యారు. మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి విజయ్ షా.. కించపరిచేలా మాట్లాడారు. పాకిస్థాన్ ను ఉద్దేశించి మతం పేరుతో ఆమెను అవమానించడంతో మంత్రిని తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో దిగొచ్చిన మంత్రి.. సోఫియాకు 10 సార్లు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమన్నారు. ‘కులమతాలకతీతంగా ఆమె భారత్ కు దొరికిన ఆణిముత్యం.. నా సొంత సోదరి కంటే ఎక్కువగా సోఫియాను గౌరవిస్తా.. దేశానికి చేస్తున్న సేవకు ఆమెకు సెల్యూట్ చేస్తున్నా.. నేనన్న మాటలతో బాధ కలిగితే క్షమాపణ చెబుతా..’ అని విజయ్ షా అన్నారు.