
కలకత్తా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పార్టీ మారిన MLAను పశ్చిమబెంగాల్ శాసనసభకు అనర్హుడిగా ప్రకటించింది. BJP నుంచి గెలిచిన సీనియర్ లీడర్ ముకుల్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. 2021లో కృష్ణానగర్ నార్త్ నుంచి గెలిచిన కొద్దికాలానికే TMCలో చేరారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం ఆయన అనర్హుడంటూ జస్టిస్ దేబాంగ్షు బసక్, ఎం.డి.షబ్బర్ రషీది బెంచ్ తీర్పు ఇచ్చింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తీర్పులో తెలిపారు. నిరాకరించిన స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానం పక్కనపెట్టింది. అనవసర జాప్యం రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది.