
MLAల అనర్హతపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం జరిగింది. విచారణకు మరో 2 నెలల గడువివ్వాలని కోర్టును స్పీకర్ కోరారు. పార్టీ ఫిరాయించారని 10 మందిపై BRS పోరాటం చేస్తోంది. అందులో నలుగురైన గూడెం మహిపాల్ రెడ్డి, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ విచారణ పూర్తయింది. ఇక అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, డా.సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి విచారణ మిగిలి ఉంది. కడియం శ్రీహరి, దానం నాగేందర్ సమాధానమివ్వలేదు. అనర్హత(Disqualification) కేసులో 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని జులై 31న సుప్రీం ఆదేశించగా, ఆ గడువు నేటితో పూర్తవుతోంది. దీంతో గడువు కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.