
ప్రధాని మోదీకి ఆశ్చర్యకర ప్రశ్న ఎదురైంది. భారత మహిళల టీం ఆయనతో భేటీ అయింది. ‘మీ ముఖంలో ఇంత గ్లో ఎలా వచ్చింది.. స్కిన్ కేర్ బాగుంది’ అంటూ హర్లీన్ కౌర్ డియోల్ మోదీని అడిగింది. దీంతో తన ముఖంపై చేతిని పెట్టుకుని సిగ్గుపడ్డారు ప్రధాని. నేను దాని గురించి ఎన్నడూ ఆలోచించలేదన్నారాయన. దీంతో మరో క్రికెటర్.. ‘140 కోట్ల మంది దేశ ప్రజల ప్రేమనే అది’ అని చెప్పడంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.