మహారాష్ట్రలో జరుగుతున్న శాసనసభ(Assembly) ఎన్నికలు శంభాజీ(శివాజీ) మహరాజ్ – ఔరంగజేబ్ వర్గాల మధ్య జరుగుతున్న పోరు అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పాకిస్థాన్ భాష మాట్లాడుతున్న విపక్షాలు.. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలని కంకణం కట్టుకున్నాయన్నారు. శివాజీ మహరాజ్ ను నమ్ముతున్న తమకు ఔరంగజేబ్ ను కీర్తిస్తున్న విపక్షాలకు ఇది పోరాటమని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడారు.
కుల ఆధారిత(Cast) రిజర్వేషన్లను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందన్న మోదీ… షెడ్యూల్ కులాలు(SC), షెడ్యూల్ తెగలు(ST), ఇతర వెనుకబడ్డ కులాల(BC)ను విభజించడం ద్వారా మెజారిటీ ప్రజల్ని విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు.