‘ఆపరేషన్ సిందూర్’ భారత ఉక్రోషం కాదని, అది మన రౌద్ర రూపానికి నిదర్శనమని ప్రధాని మోదీ(Modi) అన్నారు. ‘పాకిస్థాన్ ప్రత్యక్ష యుద్ధం చేయబోదు.. అలా చేస్తే ఆ దేశం ఉండదు.. భారత్ లో రక్తపాతం సృష్టించినవాళ్లను ముక్కలు ముక్కలు చేశాం.. ఇక ఉగ్రదాడి జరిగితే మన జవాబు ఇలాగే ఉంటుంది.. ‘ఆపరేషన్ సిందూర్’తో ప్రజలంతా గర్వంగా ఉప్పొంగిపోతున్నారు.. పహల్గాం ఘటనకు 23 నిమిషాల్లోనే బదులిచ్చాం.. ఇక మాటల్లేవ్, వాణిజ్యం లేదు, కేవలం PoKపైనే చర్చ..’ అని గుర్తు చేశారు.