రెండేళ్లుగా జాతి ఘర్షణలతో కల్లోలంగా మారిన మణిపూర్(Manipur)లో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. ఈనెల 13న ఆయన ఈశాన్య రాష్ట్రంలో పర్యటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. కుకీ, మైతేయి(Meitei) తెగల మధ్య మారణకాండతో వేలాది మంది శిబిరాల్లో కాలం గడుపుతున్నారు. బీరేన్ సింగ్ CM పదవి నుంచి తప్పుకోవడంతో 2025 ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. రెండు తెగల మధ్య శాంతియుత పరిష్కారంపై దృష్టిపెట్టిన కేంద్రం.. ప్రధాని పర్యటనతో దాన్ని సాకారం చేయాలని చూస్తోంది.