ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాసేపట్లో రాజీనామా(Resignation) చేయబోతున్నారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. రాజీమానా లేఖను రాష్ట్రపతి(President) ద్రౌపది ముర్ముకు అందజేయగానే పాత ప్రభుత్వం రద్దవుతుంది. అనంతరం సాయంత్రం నిర్వహించే NDA మిత్రపక్షాల సమావేశంలో ప్రధాని ఎంపిక జరుగుతుంది.
ఈ సమావేశం తర్వాత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడో సారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. నిన్నటి ఫలితాల్లో కమలం పార్టీకి మరోసారి అధికార పీఠం దక్కిన సంగతి తెలిసిందే.