ప్రధానమంత్రి(Prime Minister) నరేంద్ర మోదీ ఈ నెల 11న మరోసారి రాష్ట్రానికి రాబోతున్నారు. ఆ రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించి ప్రధాని షెడ్యూల్ విడుదలైంది. ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 7న మోదీ రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఎల్.బి.స్టేడియంలో నిర్వహించిన BC ఆత్మగౌరవ సభకు ఆయన అటెండ్ అయ్యారు.