దేశంలో చిన్న చిన్న సమస్యలే ఇబ్బందికరంగా మారుతున్నాయని, కానీ వెయ్యేళ్లపాటు వెనక్కు తిరగని రీతిలో అభివృద్ధి దిశగా సాగుతున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ఆయన జెండా ఎగురవేశారు. ప్రైమ్ మినిస్టర్ గా మోదీ పదోసారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మణిపూర్ అంశం బాధాకరమని, దేశమంతా ఆ రాష్ట్రం వెంటే ఉందని తెలిపిన మోదీ.. త్వరలోనే అక్కడ శాంతి నెలకొంటుందని అన్నారు. డిజిటల్ రంగంలో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నామన్న ప్రధాని.. వెయ్యేళ్ల భవిష్యత్తుపై ప్రస్తుతం నడక సాగిస్తున్నామన్నారు.
కరోనా సంక్షోభం తర్వాత భారత్ పై ప్రపంచానికి కొత్త నమ్మకం కలిగిందని గుర్తు చేశారు. గత తప్పిదాల కారణంగా వెయ్యేళ్లు బానిసత్వంలో ఉన్నామన్న మోదీ… ఇప్పుడు కొత్త భారతావని దిశగా అడుగులు వేస్తున్నామని అందులో సఫలీకృతమవుతామని స్పష్టం చేశారు.