మణిపూర్ లో శాంతిని నెలకొల్పి మళ్లీ పాత రోజులు గుర్తుకు తేవాలని విపక్షాలకు చెందిన ఇండియా కూటమి సభ్యులు అన్నారు. ఈశాన్య రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించాలని కోరారు. ఇంఫాల్ రాజ్ భవన్ లో గవర్నర్ అనుసూయ ఉకేతో ఎంపీల టీమ్ మీట్ అయి చర్చలు జరిపింది. ఆమెకు మెమోరాండం ఇచ్చి అక్కడి పరిస్థితిని 21 మంది MPలు గవర్నర్ కు వివరించారు. పరిస్థితులు దారుణంగా దిగజారిపోయాయని, ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ MP అధిర్ రంజన్ చౌధురి డిమాండ్ చేశారు. మణిపూర్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని, ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్లే సమస్యలు వచ్చాయని విమర్శించారు.
వీలైనంత తొందరగా శాంతిని నెలకొల్పాలని అధిర్ రంజన్ చౌధురి సూచించారు. మణిపూర్ లో పరిస్థితిని పరిశీలించేందుకు ఇండియా కూటమి MPల బృందం రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించింది. రిహాబిలిటేషన్(Rehabilitation) సెంటర్లలో తలదాచుకున్న వేల మంది బాధితుల్ని కలుసుకుని జరిగిన ఘటనల గురించి MPలు అడిగి తెలుసుకున్నారు.