పార్లమెంటు సభ్యుల(Member Of Parliament)కు వేతనాలు, అలవెన్సులను పెంచింది కేంద్ర ప్రభుత్వం. అటు మాజీ MPలకు పింఛన్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ తాజా నిర్ణయంతో ఒక్కో సభ్యుడి వేతనం 24% పెరగనుంది. ఒక్కొక్కరి వేతనం లక్ష రూపాయల నుంచి రూ.1.24 లక్షలకు పెరుగుతుంది. వారి రోజువారీ భత్యం రూ.2 వేల నుంచి రూ.2,500 కానుంది. ఇక మాజీ MPల పింఛను ఇప్పటిదాకా రూ.25,000 ఉండగా, ఇకనుంచి రూ.31,000 కానుంది. ఈ పెంపు 2023 ఏప్రిల్ నుంచి వర్తిస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.