107 ఏళ్ల రికార్డు కనుమరుగు.. ఒకే రోజు 25 సెం.మీ.కు పైగా వాన.. నదులు, కాలువల్ని తలపిస్తున్న రోడ్లు… ఇదీ ముంబయి పరిస్థితి. ఏటా జూన్ 11న వచ్చే నైరుతి రుతుపవనాలు ఈసారి 16 రోజుల ముందుగానే మహారాష్ట్రను పలకరించాయి. వస్తూవస్తూనే తొలిరోజునాడే 25 సెం.మీ.కు పైగా వాన పడటంతో మహా నగరం కాస్తా నదిలా మారింది. థానే(Thane), రాయగడ్, రత్నగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. నారీమన్ పాయింట్లో 25.2, బైకుల్లాలో 21.3, కొలబాలో 20.7, డోటాకి స్టేషన్ వద్ద 20.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1918 మేలో 27.9 సెం.మీ. ఇప్పటిదాకా అత్యధికం కాగా, ఈ నెలలో 29.5 సెం.మీ.తో ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.