
రాజకీయ పార్టీలకు ఎలాంటి మద్దతు ఇవ్వబోమని RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ముస్లింలు RSSలో భాగం కావొచ్చా అని మోహన్ భగవత్ ను అడిగితే.. ‘సంఘ్ లో బ్రాహ్మణులు, ముస్లింలు, క్రిస్టియన్లు.. ఇలా ఎవరికీ అనుమతి లేదు.. ఏ వర్గాల వ్యక్తులైనా సంఘ్ లోకి రావచ్చు.. కులం, మతాన్ని పక్కనపెట్టాలి.. వీరు శాఖకు వచ్చినపుడు భారతమాత కుమారుడిగానే ఉంటారు.. ముస్లింలు, క్రైస్తవులు వచ్చినా మతాల వారీగా చూడబోం.. వారు ఎవరు అని అడగబోం.. సిద్ధాంతాలకు RSS మద్దతిస్తుంది కానీ రాజకీయ పార్టీలకు కాదు.. సమాజ ఐక్యత కోసం సంఘ్ పనిచేస్తుంది.. అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేపట్టాలన్నది మా లక్ష్యం.. దానికి ఎవరు మద్దతిస్తే వారితో ఉంటాం.. BJP ఓటేసింది కాబట్టే సమర్థించాం.. ఒకవేళ కాంగ్రెస్ వస్తే సంఘసేవకులు వాళ్లకు ఓట్లేసేవారు.. ‘ అని విస్పష్టంగా తేల్చిచెప్పారు.