చేసేదే చిన్న ఉద్యోగం… మననెవరు గుర్తిస్తారులే అనే అనుకుంటారు చాలామంది. కానీ కష్టపడే తత్వం, చేసే పనిలో అంకిత భావం ఉంటే ఎంతమందిలోనైనా నంబర్ వన్ గా నిలవొచ్చని ఓ చిరుద్యోగి నిరూపించారు. టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పనిచేస్తున్న ఆమె.. ఈ గుర్తింపుతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ A.కవిత.. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి చేతుల మీదుగా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఫీల్డ్ లో అత్యున్నత సేవలు అందించినందుకు గాను కవితను ఈ అవార్డుకు… నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) కమిటీ ఎంపిక చేసింది. గ్రౌండ్ లెవెల్లో అత్యుత్తమ సేవలందించే ఫ్రంట్ లైన్(Frontline) స్టాఫ్ కు ఈ అవార్డును అందజేస్తుంటారు.
ఏటా నిర్వహించే గ్లోబల్ టైగర్ డే సెలెబ్రేషన్స్ సందర్భంగా 2023కు గాను ఈ అవార్డును కవిత అందుకున్నారు. ఉత్తరాఖండ్ లోని కోర్బెట్ టైగర్ రిజర్వ్ కేంద్రం వద్ద కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. జాతీయస్థాయి అవార్డుకు ఓ చిరుద్యోగి సెలెక్ట్ కావడం పట్ల.. ఆమె శ్రమకు తగిన గుర్తింపు దక్కినట్లయిందని ఆ శాఖ ఉద్యోగులు కొనియాడుతున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు ఉద్యోగులతోపాటు అటవీశాఖ ఉన్నతాధికారులు కవితకు అభినందనలు తెలియజేశారు.
Congratulations Madam