పహల్గామ్ దాడి(Attack) తర్వాత పాక్ తో ఉద్రిక్తతలు ముదిరిన వేళ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్వవస్థీకరించింది. ‘రా’ మాజీ చీఫ్ అలోక్ జోషి ఛైర్మన్ నేతృత్వంలో.. మిలిటరీ, IFS, IPS అధికారులతో కూడిన ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ ఎయిర్ మార్షల్ పి.ఎం.సిన్హా, లెఫ్టినెంట్ జనరల్ ఎ.కె.సింగ్, రియర్ అడ్మిరల్ మాంటీ ఖన్నా, రిటైర్డ్ IFS బి.వెంకటేశ్ వర్మ, విశ్రాంత IPSలు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది.