ఉగ్రవాద శిబిరాలపై నిన్న జరిపిన దాడులకు మన ఏజెన్సీ సమాచారమే వరమైంది. కలుగులో దాక్కున్నా కనిపెట్టే ‘నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(NTRO)’ వేగంగా, కచ్చిత సమాచారాన్ని అందించింది. ప్రధాని, భద్రతా సలహాదారు(NSA) చేతుల్లో పనిచేసే NTRO 2004లో మొదలైంది. ఇంటెలిజెన్స్ బ్యూరో(IB), రీసెర్చ్&అనాలిసిస్ వింగ్(R&AW)లా సేవలందిస్తుంది. NTRO అసలు పేరు NTFO(నేషనల్ టెక్నికల్ ఫెసిలిటీస్ ఆర్గనైజేషన్). రూ.700 కోట్లతో హైటెక్ పరికరాలు, స్పై శాటిలైట్లు, UAVలు, స్పై విమానాలు సొంతం. 1999 కార్గిల్ యుద్ధానికి ముందు.. నిఘా వైఫల్యంపై సుబ్రమణ్యం కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా NTFO ఏర్పాటైంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2001 అక్టోబరులో దీనికి రూపకల్పన చేశారు. ఈ ఏజెన్సీ ద్వారా వెరీ లాంగ్ రేంజ్ ట్రాకింగ్ రాడార్(VLRTR) వ్యవస్థతో IAF.. మిసైళ్లు, బాలిస్టిక్ మిసైళ్ల ఆపరేషన్ చేపట్టింది.