10 కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపుతో రేపు(జులై 9) దేశవ్యాప్త బంద్ ఉండనుంది. కార్పొరేట్ ప్రయోజనాల కోసమే కేంద్రం పనిచేస్తోందంటూ బంద్ కు పిలుపునిచ్చాయి. వివిధ రంగాల్లోని 25 కోట్ల మందికిపైగా ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో పాల్గొంటారని ట్రేడ్ యూనియన్లు తెలిపాయి. ఈ ప్రభావం స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులపై పడనుంది. అటు విద్యుత్తు సరఫరాకు సైతం అంతరాయం కలిగే అవకాశముందన్నాయి. విద్యాలయాలు, బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలకు అధికారిక సెలవు ప్రకటించకున్నా.. సేవలకు అంతరాయం కలిగే అవకాశముంది.