మదర్సాలు చదువుకు ఏమాత్రం పనికిరావని, అక్కడ బోధించే విద్య నిరుపయోగం(No Use) అని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR).. సర్వోన్నత న్యాయస్థానాని(Apex Court)కి తెలిపింది. మదర్సాల్లో బోధించే విద్య విద్యాహక్కు చట్టం(RTE) పరిధిలోని రూల్స్ కు విరుద్ధమంటూ అఫిడవిట్లో స్పష్టం చేసింది. ముస్లిమేతర విద్యార్థులకు ఇస్లాం బోధన చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని తెలియజేసింది.
ఇది RTE(రైట్ టు ఎడ్యుకేషన్) పరిధిలో లేకపోవడంతో యూనిఫాం, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలకు పిల్లలు దూరమవుతున్నారని వివరించింది. NCERT పుస్తకాల్లోని కొన్నింటిని మాత్రమే బోధించి చదువును ఇస్తున్నామంటూ మదర్సాలు మోసం చేస్తున్నాయని, అవి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదంటూ NCPCR(నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్) తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేయడంతో ఆ సంస్థ సుప్రీంను ఆశ్రయించింది.