
దశాబ్దాల నుంచి మనం వింటున్న IPC, CrPC వంటి బ్రిటిష్ చట్టాలకు కాలం చెల్లింది. వీటి స్థానంలో పూర్తి ‘భారతీయత’తో కూడిన పేర్లతో కొత్త చట్టాలు అందుబాటులోకి వచ్చాయి. IPC, CrPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ను రద్దు చేస్తూ వాటి ప్లేస్ లో అధునాతన యాక్ట్ లు తీసుకువచ్చింది. వీటిని హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టగా.. పరిశీలన కోసం వాటిని స్థాయీ సంఘానికి పంపించారు. FIR నమోదు నుంచి తీర్పు వచ్చేవరకు మొత్తం ప్రక్రియంతా డిజిటల్ సిస్టమ్ లోనే జరపడం.. సామూహిక అత్యాచారాల్లో నిందితులకు 20 ఏళ్లు లేదా జీవిత కాల జైలుశిక్ష.. మైనర్లపై అత్యాచారాల్లో దోషిగా తేలితే మరణశిక్ష, గ్యాంగ్ అటాక్స్ కు పాల్పడి రుజువైతే ఏడేళ్లు, తీవ్రతను బట్టి జీవిత ఖైదు, మరణశిక్ష పడేలా చట్టాలు తయారయ్యాయి.
మూడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో సంక్షిప్త విచారణ వల్ల కింది కోర్టుల్లో 40 శాతం కేసులు తగ్గుతాయని కేంద్రం భావించింది. 2027 నాటికి దేశంలోని అన్ని కోర్టుల్లో కంప్యూటరైజ్డ్(Computerized).. త్వరలోనే e-FIRల నమోదుకు చర్యలు.. విచారణ తర్వాత 30 రోజుల్లోనే తీర్పు.. తర్వాత వారంలోనే దాన్ని ఆన్ లైన్లో ఉంచడం వంటి నిబంధనల్ని కేంద్రం ప్రవేశపెట్టింది.