
దేశ సర్వోన్నత న్యాయస్థానాని(Supreme Court)కి నూతన ప్రధాన న్యాయమూర్తి నియమితులయ్యారు. 53వ CJIగా జస్టిస్ సూర్యకాంత్ ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుత CJI బి.ఆర్.గవాయ్ స్థానంలో ఆయన నవంబరు 24న బాధ్యతలు చేపడతారు. చీఫ్ జస్టిస్ సిఫార్సుల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో కొత్త CJI రాబోతున్నారు. జస్టిస్ సూర్యకాంత్ శర్మ స్వస్థలం హరియాణాలోని హిసార్ జిల్లా పెట్వార్. ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు. తొలుత హిసార్ జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేసిన జస్టిస్ సూర్యకాంత్.. 1985లో పంజాబ్-హరియాణా హైకోర్టుకు మారారు..
