సీనియర్ IAS అధికారులను కీలక పోస్టుల్లో నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పౌర విమానయాన(Civil Aviation) డైరెక్టర్ జనరల్(DG)గా ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ ను నియమించింది. 1996 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ కు చెందిన ఈయన ప్రస్తుతం వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖకు అదనపు కార్యదర్శిగా ఉన్నారు. ఫైజ్ అహ్మద్ ఇదే ర్యాంక్ హోదాలో DGCA డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. మధ్యప్రదేశ్ కేడర్ కే చెందిన మరో ఐఏఎస్ ఆకాశ్ త్రిపాఠి ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సీఈవోగా ఉండగా, ఆయన్ను విద్యుత్తు శాఖకు బదిలీ చేశారు.
కార్మిక, ఉపాధి శాఖ అడిషనల్ సెక్రటరీ కమల్ కిశోర్ సోన్ ను జల్ జీవన్ మిషన్ డైరెక్టర్ గా… హోం అఫైర్స్ అదనపు కార్యదర్శి అశుతోష్ అగ్నిహోత్రిని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా.. వ్యవసాయశాఖ అడిషనల్ సెక్రటరీ శుభా ఠాకూర్ ను హోం అఫైర్స్ ఆధ్వర్యంలోని ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ కు బదిలీ చేస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు విడుదల చేసింది.