భారత కొత్త ఉపరాష్ట్రపతిగా NDA అభ్యర్థి సి.పి.రాధాకృష్ణన్ గెలుపొందారు. ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాధాకృష్ణన్ కు 452, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. 767 ఓట్లు పోలయ్యాయి. 1957 అక్టోబరు 20న తమిళనాడు తిరుప్పూర్ లో రాధాకృష్ణన్ జన్మించారు. 1998, 1999లో కోయంబత్తూరు MPగా గెలిచిన ఆయన.. 2004-07 కాలంలో తమిళనాడు BJP అధ్యక్షుడిగా పనిచేశారు.