ఫార్మా పరిశ్రమల కోసం భూసేకరణ(Land Aquisition) విషయంలో జరిగిన దాడిపై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) స్పందించింది. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఘటన జరిగిన ప్రదేశమైన వికారాబాద్ జిల్లా లగచర్లకు ఒక టీంను పంపాలని నిర్ణయించింది. జరిగిన ఘటనపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS)తోపాటు DGPకి ఆదేశాలు ఇచ్చింది. తమపై అకారణంగా దాడి చేసి పోలీసులు అరెస్టు చేశారంటూ పలువురు బాధితులు ఢిల్లీలోని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ను కలిశారు. BRS నేతల ఆధ్వర్యంలో బాధితులు NHRCకి ఫిర్యాదు చేశారు.