రాష్ట్ర పోలీసులకు జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) నోటీసులు జారీ చేసింది. సంధ్య థియేటర్ ఘటనపై వివరాలు ఇవ్వాలంటూ DGPతోపాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు నోటీసులు ఇచ్చింది. ఈ ఘటనపై సీనియర్ పోలీసు అధికారితో విచారణ జరిపించాలని హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశించింది. తొక్కిసలాటపై నాలుగు వారాల్లో నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి రేవతి మృతిచెందగా, ఆమె తనయుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ న్యాయవాది NHRCకి కంప్లయింట్ ఇచ్చారు.