Published 29 Jan 2024
ఆయనో సీనియర్ రాజకీయ నేత(Senior Leader).. ఒక పార్టీకి అధినేతగా ఉన్నారు.. ఎవరితో జట్టుకట్టినా ముఖ్యమంత్రి మాత్రం ఆయనే. అలాగని ఆయన పార్టీదే భారీ మెజారిటీ అనుకునేరు. మరో రెండు ప్రధాన పార్టీల కన్నా తక్కువ సీట్లే ఉన్నా ఈ పొత్తులతోనే ఆ సీనియర్ నేత ముఖ్యమంత్రి(Chief Minister)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ పొత్తుల విషయంలో అటూ ఇటూ తిరుగుతూ సరైన నిర్ణయం తీసుకోలేపోతున్నారు. అయినా తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనతను మూటగట్టుకున్నారు బిహార్ CM నితీశ్ కుమార్. ఇప్పటివరకు ఇండియా కూటమిలో ఉన్న జనతాదళ్-యూ(JD(U)) అధినేత నితీశ్ కుమార్.. ఇప్పుడు NDA కూటమిలో చేరిపోయారు.
అటూఇటు… ఇటూ అటు…
ఏడాదిన్నర క్రితం NDAను వదిలేసిన ఆయన తిరిగి అదే గూటికి చేరుకున్నారు. 2020లో ఎన్నికలు జరిగినప్పట్నుంచీ ఇప్పటివరకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్ లో లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్(RJD)తో కలిసి మహాగఠ్ బంధన్ కూటమిని ప్రారంభించిన నితీశ్.. అప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. నిన్న అనూహ్యంగా పదవికి రాజీనామా చేసిన ఆయన మళ్లీ గవర్నర్ చేత ప్రమాణం చేస్తూ ఇద్దరు BJP లీడర్లను డిప్యుటీ చీఫ్ మినిస్టర్లుగా నియమించారు. నితీశ్ కుమార్ కూటము(Alliance)లు మారడం ఇది ఐదోసారి కావడం విశేషంగా నిలిచేలా చేస్తోంది.
మెజార్టీ లేని పార్టీ అయినా…
243 నియోజకవర్గాలు గల బిహార్ అసెంబ్లీలో RJD-79, BJP-78, JDU-45, కాంగ్రెస్-19, CPI(ML)-12, HAM-4, CPM-2, CPI-2 చొప్పున స్థానాలున్నాయి. జేడీయూ, బీజేపీ, హెచ్ఏఎం కలిస్తే 127 స్థానాలు అవుతాయి. మిగతా అన్ని పార్టీలు కలిసినా మెజార్టీ సాధించే అవకాశం లేకపోయింది. బిహార్ లో అధికారం చేపట్టాలంటే 122 స్థానాలు ఉంటే చాలు. ఇండియా కూటమి నుంచి ఎన్డీయే కూటమికి చేరడంతో బిహార్ రాజకీయాలు మరోసారి ఇంట్రెస్టింగ్ గా మారాయి.