శిరస్త్రాణం(Helmet) లేకుండా వచ్చే వాహనాలకు పెట్రోలు బంద్ చేస్తోంది యూపీ సర్కారు. ఇందుకోసం 2025 సెప్టెంబరు 1 నుంచి 30 వరకు పోలీసు, రవాణా, రెవెన్యూ శాఖలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. రోడ్డు ప్రమాదాల(Accidents) నివారణకు హెల్మెట్ తప్పనిసరి అని యోగి సర్కారు పిలుపునిచ్చింది. 1988 మోటార్ వాహన చట్టం సెక్షన్ 129 ప్రకారం టూవీలర్ పై వెళ్లే ఇద్దరూ హెల్మెట్లు ధరించాల్సిందే. ఉల్లంఘిస్తే ఫైన్ వేస్తారు. ఇది శిక్ష కాదని, అవగాహన కోసమే అలా చేస్తున్నామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.