క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బిహార్(Bihar) పోలీసు శాఖ సంచలన ఆదేశాలిచ్చింది. మహిళా పోలీసులకు నగలు(Jewellery), మేకప్ ను నిషేధించింది. గాజులు, ఉంగరాలు, ముక్కుపుడక, చెవిరింగులు, నెక్లెస్, కాస్మోటిక్స్ వాడకూడదు. కానిస్టేబుల్ నుంచి CI దాకా డ్యూటీలో ఎవరూ వాడొద్దంటూ ADG ఆదేశాలిచ్చారు. యూనిఫాం, మేకప్, నగలు వేసుకుని కొందరు చేసిన రీల్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కొన్నిసార్లు ఆయుధాలతో వీడియోలు తీసుకున్నట్లు గుర్తించి 10 మందిని సస్పెండ్ చేశారు. ఇలా హద్దులు దాటుతున్నారంటూ ‘సర్వీస్ రూల్స్ అతిక్రమణ’ను జారీ చేశారు. విధుల్లో బ్లూటూత్ కూడా వాడొద్దని.. పురుష పోలీసులు సైతం యూనిఫాం సరిగా వేసుకోవాల్సిందేనని ఆదేశాలిచ్చారు. https://justpostnews.com