కొత్తగా కొలువుదీరిన 18వ లోక్ సభకు అధిపతి(Speaker)ని ఎన్నుకునే కార్యక్రమం మొదలైంది. ఈ సభాపతి పదవికి NDA తరఫున ఓం బిర్లా నామినేషన్ వేయబోతున్నారు. కాసేపట్లో నామినేషన్ వేసే ముందు ప్రధాని నరేంద్రమోదీని పొద్దున ఓం బిర్లా కలిశారు. రాజస్థాన్(Rajasthan) కోటా నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన.. 2019లో తొలిసారి స్పీకర్ గా ఎన్నికయ్యారు.
మూడోసారి సభలో…
ఓం బిర్లా మూడోసారి సభలో ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇప్పుడు రెండోసారి స్పీకర్ పదవికి నామినేషన్ వేస్తున్నారు. మెజారిటీ కమలం కూటమిదే కాబట్టి ఆయన ఎన్నిక లాంఛనమే కావచ్చు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల్ని ఏకగ్రీవంగా భర్తీ చేసేందుకు విపక్ష ఇండియా కూటమి నేతల్ని BJP లీడర్లు సంప్రదించారు.