న్యూక్లియర్ పవర్డ్ వార్ షిప్స్(Warships), స్టెల్త్ బాంబర్ డ్రోన్ల వంటి అత్యాధునిక ఆయుధాలు రాబోతున్నాయి. తర్వాతి తరం(Next Gen) యుద్ధ ట్యాంకులు, హైపర్ సోనిక్ మిసైల్స్, AI పవర్డ్ ఆయుధాలను భారత్ సమకూర్చుతోంది. 15 ఏళ్ల ప్రణాళికలో భాగంగా T-72ల స్థానంలో 1,800 మోడ్రన్ ట్యాంకులు, పర్వతాల్లో ఉంచేందుకు 50 వేల యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, 700 రోబోటిక్ కౌంటర్-IED సిస్టమ్స్ రానున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కోసం భారీ స్థాయిలో ఖర్చుకు కేంద్రం సిద్ధమైంది. శత్రువుకు కనిపించని అత్యాధునిక 75 సూడో శాటిలైట్లు వైమానిక దళానికి అందుతాయి.