జమిలి ఎన్నికల(One Election)పై నేడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC) తొలిసారిగా సమావేశం కానుంది. జమిలి బిల్లుపై JPC సభ్యులు చర్చించనుండగా, ప్రతిపాదిత చట్టాల నిబంధనల్ని వీరికి న్యాయ మంత్రిత్వ శాఖ వివరించే అవకాశాలున్నాయి. పార్లమెంటు ఈ శీతాకాల సమావేశాల్లో(Winter Sessions) 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. జమిలి బిల్లును విపక్ష పార్టీలు వ్యతిరేకించడంతో కేంద్రం.. JPCకి పంపించింది. వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత JPC తన రిపోర్టును వచ్చే పార్లమెంటు సెషన్స్ లో మొదటి వారం చివరి రోజున లోక్ సభలో సమర్పించాల్సి ఉంది. 39 మంది సభ్యుల కమిటీకి BJP MP పి.పి.చౌదరి నేతృత్వం వహిస్తుండగా, కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ, AAP ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.