జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో అవి ఎలా జరుగుతాయన్న సందేహం చాలా మందిలో ఉంది. ఇందుకోసం 2023 సెప్టెంబరు 2న ఏర్పాటైన రాంనాథ్ కోవింద్ కమిటీ.. ఆరున్నర నెలల పాటు వివిధ వర్గాలతో భేటీ అయి 18,626 పేజీల రిపోర్ట్ తయారు చేసంది. ఈ నివేదిక చట్టరూపం దాలిస్తే ఇక జమిలి ఎన్నికలకు ముందడుగు పడుతుంది.
ఎలా అంటే…
ఈ విధానం అమలైతే దేశంలో రెండు దశల్లో(Stages) ఎలక్షన్లు జరుగుతాయి. తొలుత పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించనుండగా.. ఆ తర్వాత స్థానిక సంస్థల(Local Bodies)కు ఓటింగ్ చేపడతారు. తొలి దశ ఎన్నికలు పూర్తయ్యాక 100 రోజులకు రెండో దశలో గ్రామ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతాయి.
మనదేశంలో 1967 వరకు లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. 1967 తర్వాత కొన్ని శాసనసభలు రద్దు కాగా, 1972లో జరగాల్సిన లోక్ సభ ఎన్నికల్ని ముందుగానే పూర్తి చేశారు. అసెంబ్లీలు ముందుగానే రద్దు కావడంతో తర్వాతి ఎన్నికల్ని ఏకకాలంలో నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ జమిలి ఎన్నికలకు రాజ్యాంగంలో 5 ఆర్టికల్స్ లో సవరణలు చేయాల్సి ఉంటుంది.
అసెంబ్లీల పదవీకాలానికి, రాష్ట్రపతి పాలన విధించడానికి గల అవకాశాలను పరిశీలించి ఈ సవరణలు చేయాలి. 1983లోనూ జమిలి ఎన్నికల ప్రతిపాదనలు రాగా కాంగ్రెస్ పట్టించుకోలేదు. కానీ ఈ విధానాన్ని అమలు చేయాలని 1999లో లా కమిషన్ ప్రతిపాదించిన టైంలో BJP అధికారంలో ఉంది. కానీ అప్పుడూ పెద్దగా స్పందన రాలేదు. ఇక ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే 35 లక్షల EVMలు అవసరమవుతుండగా.. రూ.4,000 కోట్ల దాకా ఖర్చు కానుంది.