కేరళ మాజీ CM, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నారు. రెండు సార్లు కేరళ CMగా పనిచేసిన చాందీ.. 12 సార్లు MLAగా ఎన్నికయ్యారు. 1943 అక్టోబరు 31న కేరళలో జన్మించిన ఊమెన్ చాందీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. గొంతు సమస్య వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆయన్ను ట్రీట్మెంట్ కోసం గతేడాది నవంబరులో జర్మనీ తరలించారు.
కేరళ స్టూడెంట్స్ యూనియన్ KSUకు 1967-69 వరకు ప్రెసిడెంట్ గా ఉన్న చాందీ.. 1970లో యూత్ కాంగ్రెస్ చీఫ్ గా నియమితులయ్యారు. అదే సంవత్సరంలో పుత్తుపల్లి నియోజకవర్గం నుంచి MLAగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి నిరంతరాయంగా 2021 వరకు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు. నాలుగు సార్లు మంత్రిగా పనిచేశారు. కేరళకు 12 మంది ముఖ్యమంత్రులుగా పనిచేస్తే అందులో అత్యధిక కాలం CMగా వ్యవహరించిన వ్యక్తుల్లో చాందీ నాలుగో స్థానంలో నిలిచారు.