ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన దాడుల్లో డజను మంది ప్రధాన టెర్రరిస్టులు హతమయ్యారు. 1999లో విమానం హైజాక్ మాస్టర్ మైండ్, జైషే మహ్మద్ నంబర్-2 అబ్దుల్ రవూఫ్ అజహర్ అందులో ఉన్నాడు. ఇతడు జైషే చీఫ్ మసూద్ కు చిన్న తమ్ముడు. 2001లో పార్లమెంటుపై, 2016లో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడుల్లో రవూఫ్ సూత్రధారి. 2010లో ఇతణ్ని ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించగా, భారత్ ప్రతిపాదనతో 2022లో ఐరాస బ్లాక్ లిస్టులో పెట్టింది. కానీ సరైన ఆధారాల్లేవంటూ చైనా అడ్డుకోవడంతో తప్పించుకున్నాడు. 2002లో అమెరికన్-యూదు జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్ ను కిడ్నాప్, హత్య చేసిన ఒమర్ సయీద్ షేక్ ను విడుదల చేసింది రవూఫే. ఇతణ్ని సగర్వంగా పైకి పంపామంటూ(Elimination) ఫొటోతో సహా ‘X’లో BJP పోస్ట్ చేసింది.