దేశవ్యాప్తంగా 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా NDA సాగుతుంటే, మోదీ సర్కారును అడ్డుకుని పీఠం దక్కించుకోవడమే టార్గెట్ గా INDIA కూటమి రెడీ అయింది. ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో సత్తా చూపాలని రెండు కూటములు(Alliances) ప్లాన్ అమలు చేస్తున్నాయి. ఈ సారి దక్షిణాది(South India)లో సత్తా చూపాలని NDA కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆరు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందన్న దానిపై ఇండియా టీవీ సీఎన్ఎక్స్(India TV CNX) ఒపినీయన్ పోల్ నిర్వహించింది. అన్ని రాష్ట్రాల్లోని 130 సెగ్మెంట్లలో ఒపీనియన్ పోల్ నిర్వహించినట్లు తెలిపిందా సంస్థ.
రాష్ట్రాల వారీగా పార్టీల సీట్లు ఇలా….
తెలంగాణ…:
ఇక్కడ BRSకు రెండే సీట్లు రానుండగా అత్యధికంగా కాంగ్రెస్ కు దక్కనున్నాయి. రెండో స్థానంలో కమలం పార్టీ నిలవబోతున్నది. 2019 ఎన్నికల్లో మల్కాజిగిరి, భువనగిరి, నల్గొండలో కాంగ్రెస్ గెలుపొందింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ లో BJP పాగా వేసింది. పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం సెగ్మెంట్లు BRS పార్టీవి.
INC – 09
BJP – 05
BRS – 02
AIMIN – 01
ఆంధ్రప్రదేశ్…:
ఇక్కడ BJP, కాంగ్రెస్ కు సున్నా సీట్లేనని ఒపీనియన్ పోల్ లో బయటపడింది. ఇపుడున్న సీట్లలో YSRCP ఏడింటిని కోల్పోనుండగా, వాటిని TDP దక్కించుకుంటుందట. అయినా అక్కడ జగన్ సర్కారుదే ఆధిపత్యం.
YSRCP – 15
TDP – 10
BJP – 00
Cong – 00
కేరళ…:
తిరువనంతపురంలో కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ పై BJP అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ దే ఆధిపత్యమని సర్వేలో తేలింది. ఇక్కడ BJP ఖాతా తెరవనుండగా ఆ పార్టీకి 3 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ కూటమి UDF మొత్తం 11 సీట్లలో పాగా వేస్తుందట.
UDF – 11
LDF – 06
BJP – 03
తమిళనాడు…:
తమిళనాడులో ఈసారీ DMKదే ఆధిపత్యం. BJP ఇక్కడ 5 సీట్లు సాధించబోతుండగా, కాంగ్రెస్ కు 6 దక్కుతాయట. AIADMKకు నాలుగు, ఇతరులకు 5 రానున్నాయని చెప్పింది.
DMK – 20
INC – 06
BJP – 05
AIADMK – 04
Others – 05
కర్ణాటక…:
కర్ణాటకలో విపక్షంగా ఉన్న BJPకి 22 సీట్లు రానుండగా, కాంగ్రెస్ నాలుగింటికే పరిమితమవుతుందని సర్వే వెల్లడించింది. BJP మిత్రపక్షమైన జనతాదళ్(సెక్యులర్) పార్టీకి నాలుగు దక్కుతాయట. ఈ లెక్కన కమలం పార్టీకి సంపూర్ణ మెజారిటీ దక్కనుందన్నమాట.
BJP – 22
INC – 04
JDS – 02
పుదుచ్చేరి…:
పుదుచ్చేరి సీటును భారతీయ జనతా పార్టీ దక్కించుకుంటుందని ఒపీనియన్ పోల్ ద్వారా తేలినట్లు సదరు సంస్థ ప్రకటించింది.