
రాబోయే ఎన్నికల్లో(elections) BJPని ఎదుర్కొనేందుకు జట్టు కట్టిన విపక్షాల కూటమి.. ఈ రోజు బెంగళూరులో భేటీ అవుతోంది. ఈ రెండు రోజుల మీటింగ్ కు 26 పార్టీలు అటెండ్ అయ్యే అవకాశముంది. దిల్లీ అధికారాలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ను పార్లమెంటులో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేయడంతో.. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) అటెండ్ కానుంది. ఆర్డినెన్స్ ను కాంగ్రెస్ వ్యతిరేకించాలని ఆప్ షరతు పెట్టడం, దానిపై హస్తం పార్టీ క్లారిటీ ఇవ్వడంతో ఈ మీటింగ్ కు తాము వస్తున్నట్లు ఆప్ ప్రకటించింది. BJP విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టే ఆందోళనలకు విపక్షాలు ఈ మీటింగ్ ద్వారా పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఈ భేటీ ద్వారా ఖరారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
సత్తా చూపిస్తామంటున్న బాధిత పార్టీలు
రాష్ట్రాల్లోని వ్యతిరేక ప్రభుత్వాలను BJP కూల్చేస్తోందంటూ మండిపడుతున్న శివసేన.. ఈ మీటింగ్ ద్వారా తమ యూనిటీ(unity) చూపిస్తామంటోంది. మొన్న జరిగిన బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన దారుణ ఘటనలపైనా ఇందులో చర్చించనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. ఆ ఎన్నికల్లో పెద్దయెత్తున హింస చోటుచేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.