నిజానిజాలు నిర్ధారించేందుకు గాను వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే చేసేందుకు అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చింది. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు(Orders) వెలువరించింది. ఆలయ పునాదులపై మసీదు నిర్మించారన్న వాదనలపై వాస్తవాలు గుర్తించేందుకు ఈ అనుమతి మంజూరు చేసింది. ASI సర్వేకు పర్మిషన్ ఇస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ను అలహాబాద్ హైకోర్టు సమర్థించిందని హిందూ పిటిషనర్ల తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు.
కాశీ విశ్వనాథ్ టెంపుల్ సమీపంలోని జ్ఞానవాపి మసీదులో సర్వేకు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్ ను హైకోర్టు రిజెక్ట్ చేసింది. జులై 21న వెలువడిన సెషన్స్ కోర్టు ఆర్డర్స్ ను నిరసిస్తూ మసీదు కమిటీ హైకోర్టును ఆశ్రయించింది. నలుగురు హిందూ సంఘాల మహిళలు వేసిన పిటిషన్ పై జులై 21న వారణాసి సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎ.కె.విశ్వేస… ASIకి అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు.