Published 25 Jan 2024
దేశవ్యాప్తంగా ఐదుగురికి ‘పద్మవిభూషణ్(Padmavibhushan)’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కళాకారుల విభాగంలో మెగాస్టార్ చిరంజీవికి పురస్కారం దక్కగా.. రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడిని సైతం అవార్డు వరించింది. మొత్తంగా 132 మంది ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించగా.. అందులో 110 మంది ‘పద్మశ్రీ’కి ఎంపికయ్యారు. చిరంజీవి(Art), వెంకయ్య(Public Affairs)తోపాటు బిందేశ్వర్ పాఠక్(Social Work), వైజయంతిమాల బాలి(Art), పద్మాసుబ్రమణ్యం(Art) ‘పద్మవిభూషణ్(Padmavibhushan)’కు సెలెక్ట్ అయ్యారు.
తెలంగాణకు చెందిన ఐదుగురికి…
తెలంగాణకు చెందిన పలువురు సేవావేత్తలకు పద్మశ్రీ(Padmasri) అవార్డుల్ని కట్టబెడుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సాహిత్యం, విద్యకు విశేష కృషి చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన కూరెళ్ల విఠలాచార్య… నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్రవీణ కళాకారుడు(Artist) దాసరి కొండప్ప… సాహిత్యం, విద్య రంగాలకుగాను కేతావత్ సోమ్ లాల్… వేలు ఆనందాచారి(కళలు)… జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
అవార్డులు ఇలా…
‘పద్మవిభూషణ్’ – ఐదుగురు
‘పద్మభూషణ్’ – 17 మంది
‘పద్మశ్రీ’ – 110 మంది